తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థలో పని చేస్తున్న కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఎన్ఎంయూ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. వేతన సవరణ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా సిబ్బంది కుదింపు, గ్రావిటీ తగ్గింపు వంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అద్దె ఆర్టీసీ బస్సులను ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.670 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 22 తర్వాత సమ్మెకు దితుతామని ఎన్ఎంయూ నాయకులు హెచ్చరించారు.
previous post
చంద్రబాబు కష్టపడినప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేలు గజదొంగలు: సీపీఐ నారాయణ