telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విమానంలో .. గబ్బిలానికి టికెట్ ..

bat in flight sacred passengers

ఇంట్లో చిన్న బొద్దింక కనిపిస్తే చేసే అల్లరి అంతాఇంతా కాదు, అలాంటిది ఏకంగా గబ్బిలం వచ్చేస్తే! మన చుట్టూ ఎగురుతుంటే? తలచుకుంటేనే ఏదోలా ఉంది కదా.. తాజాగా ఇలాంటి అనుభవమే అమెరికా వాసులకు ఎదురైంది. అమెరికాలోని నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి బయలుదేరింది. అందులో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ గబ్బిలం విమానంలో ఎగరడం ప్రారంభించింది.

అది చూసిన పలువురు ప్రయాణికులు హడలిపోగా, ఇంకొందరు వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్పిరిట్ ఎయిర్ లైన్స్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో స్పిరిట్ విమానాల్లో గబ్బిలాలు కనిపించడం ఇది రెండోసారనీ, ఇకపై జీవితంలో స్పిరిట్ విమానయాన సంస్థ విమానాలు ఎక్కబోనని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Related posts