సిఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో, నేను రెడీ అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. “హింసించే పులకేశి రెడ్డి గారు, నాపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో, నేను రెడీ. తెలుగుదేశం కార్యకర్త మారుతి పై హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ వారిని ప్రశ్నించిన నాపై కేసు కట్టిన వైసీపీ పోలీసులూ, దాడులకు పాల్పడుతోన్న వైసీపీపై ఎందుకు కేసులు పెట్టరు? నువ్వు అధికారంలోకొచ్చింది ప్రజల్ని రక్షించేందుకా? ప్రతిపక్షంపై కక్ష తీర్చుకునేందుకా?అధికారం అండగా అక్రమకేసులతో ప్రతిపక్షాన్ని బెదిరించి, భయపెట్టాలనుకుంటున్నావు. తెలుగుదేశం అధ్యక్షుడి నుంచి అభిమాని వరకూ, కార్యకర్త నుంచి కార్యదర్శి వరకూ ఎవ్వరూ నీ కేసులకు భయపడరు.” అంటూ సవాల్ విసిరారు.
previous post
జగన్ సీఎం కాబోతున్నారు.. ప్రజల నాడి చూసి చెబుతున్నా: రోజా