telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామన్న కేసీఆర్.. విషాద నగరంగా మార్చారు

BJP Bandi sanjay

ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, మరో ఒకటి,రెండు రోజులు వర్షాలు పడనున్నందున ప్రజలు పలు జాగ్రత్తలతో ఇళ్లకే పరిమితం కావాలని బండి సంజయ్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని… వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలని… కార్యకర్తలు స్థానిక పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు ఉన్నా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని.. వరద గుప్పిట చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

హైదరాబాద్‌లో వరద తీవ్రత తీవ్ర ఆందోళనకరంగా ఉందని… వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపకపోవడమే ముంపునకు కారణమని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగాగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, విషాద నగరంగా మార్చారని ఫైర్ అయ్యారు. ముంపు సమస్యకు ప్రధాన కారణం చెరువుల కబ్జా అని… నగరంలో చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గత పాలకుల వైఫల్యాల కారణంగానే హైదరాబాద్ ముంపునకు గురవుతోందని చెప్పిన కేసీఆర్, ఆరేళ్లలో చేపట్టిన చర్యలు ఏంటి ? అని ప్రశ్నించారు. ఇళ్లు కూలిపోయిన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts