telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నటుడు అవ్వాలని వచ్చి.. కిడ్నాపర్ అయిన వైనం..

mptc husband kidnapped in sirisilla

వెండితెరపై తనని చూసుకోవాలని గంపెడు ఆశతో నగరానికి వచ్చి.. చివరికి నేరస్తుడిగా మిగిలిన వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అవకాశాలు దొరకక కొందరు, సరైన అవకాశం రాలేదని కొందరు, వచ్చే ఆదాయం సరిపోక కొందరు .. నేరాలకు పాల్పడుతున్నారు. అయితే వీరిలో విలాసాల కోసం నేరాలు చేసే వారే ఎక్కువ. తాజాగా మరో యువకుడు నటుడు కావాలని వచ్చి, తన తోటి నటితో కలిసి కిడ్నాప్ లకు తెరలేపాడు. తమిళనాడులో కలీముల్లా అనే యువకుడు సినిమా హీరో అవ్వాలని భావించి చెన్నై వచ్చాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా హీరో చాన్స్ రాలేదు కానీ, సైడ్ రోల్స్ లభించాయి. వాటిలో ఏదీ పెద్దగా గుర్తింపునివ్వలేదు. ఈలోపు విలాసాలకు అలవాటుపడ్డాడు. డబ్బు సరిపోకపోవడంతో ఏంచేయాలో తోచక వారం రోజుల పాటు క్రైమ్ సినిమాలు చూడడంతో కిడ్నాప్ ఐడియా తట్టింది.

అచ్చం సినిమాలో చేసినట్టుగా ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ప్రియురాలు కూడా తోడుగా ఉండేందుకు సై అన్నది, ఇంకేముంది.. అమలు పరిచాడు, జైలు పాలయ్యాడు. చెన్నై షినాయ్ నగర్ కు చెందిన మూడేళ్ల పాపతో తన నేర చరిత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ పాపను కిడ్నాప్ అయితే చేయగలిగాడు కానీ, సీసీటీవీ ఫుటేజ్ లు, పోలీసులు ఉంటారని గుర్తించలేకపోయాడు. కిడ్నాప్ చేసిన తర్వాత పాప తల్లిదండ్రుల నుంచి రూ.60 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులు పోలీసులకు తెలుపడంతో వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి కలీముల్లాను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

Related posts