telugu navyamedia
ట్రెండింగ్

బాగా సంపాదిస్తున్న పిల్లి .. ఇన్స్టాగ్రామ్ లో లక్షల ఫాలోవర్స్.. 1200 కోట్ల వారసత్వ ఆస్తి.. !! గాడ్ మస్ట్ బి క్రేజీ..

cat with huge assets and doing ads

జర్మనీకి చెందిన ప్రఖ్యాత డిజైనర్ కార్ల్ లెగర్ ఫెల్డ్. ఈయనకు జర్మనీలో నాలుగు పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు సొంత బ్రాండింగ్ కంపెనీ కూడా ఉంది. బిజినెస్ లైఫ్‌‌లో బిజీగా ఉంటూ తన పర్సనల్ లైఫ్‌ గురించి ఆలోచించడం మర్చిపోయినట్లున్నారు. పెళ్లి, పిల్లలు లాంటి వ్యవహారం ఏదీ లేదు. కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి.. కోట్లలో ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ రోజు బిజినెస్ పనిమీద బయటకు వెళుతుంటే కారుకి పిల్లి అడ్డొచ్చింది. ఎందుకో దాన్ని చూస్తే కార్ల్‌కి ముద్దొచ్చింది. వెంటనే ఆ పిల్లి తాలూకు యజమాని కోసం ఆరా తీస్తే ఆ పరిసరాల్లో ఎవరూ కనిపించలేదు. కార్లో ఎక్కించుకుని దాన్ని ఇంటికి తీసుకువచ్చారు. నీకు నాకు ఏదో బంధం ఉన్నట్టుంది అందుకే నా కారుకి అడ్డొచ్చావు అని ఒడిలోకి తీసుకుని ముద్దు చేసాడు. ఇక ఆరోజు నుంచి ఆ పిల్లి దశ మారిపోయింది. దానికి పెద్ద ఎత్తున ఫంక్షన్ ఏర్పాటు చేసి ‘షూపెట్’ అని నామకరణం చేసారు. దాని బాగోగుల కోసం ఇద్దరు పని వాళ్లు, ఒక వైద్యుడిని ప్రత్యేకంగా నియమించారు.

ఇది ఇలా ఉండగా 2018లో లెగర్ ఫీల్డ్‌కు ఆరోగ్యం క్షీణించింది. వేల కోట్ల ఆస్తికి వారసులను ఎవరు నియమిస్తారో అని బంధువులు మీమాంసలో ఉండగా.. దానికి కార్ల్ మీరేమీ అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. నా ఆస్తికి వారసురాలు నా బుజ్జి షూపెట్ అని పిల్లి పేరుని ప్రకటించాడు. ఇలా అన్న కొద్ది రోజులకే కార్ల్ కాలం చేసారు. జర్మనీ చట్టాల ప్రకారం ఆస్తికి వారసులను ఎవరిని ప్రకటిస్తే వారికే చెందుతుంది.. లెగరీ ఫీల్డ్ కేవలం తన పిల్లికే కాకుండా తన వద్ద పని చేసిన పని వాళ్లకు, ట్రస్టుకు కూడా తన ఆస్తిలో వాటా రాస్తున్నట్లు ప్రకటించి మరణించారు. దీనితో ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది షూపెట్.

cat with huge assets and doing adsaవారసత్వంగా వచ్చిన ఆ ఆస్తితో పాటు షూపెట్‌ కూడా సొంతంగా పలు యాడ్లలో నటిస్తూ తన ఆస్తిని ఇంకా పెంచుకుంటోంది. ఇప్పటి వరకు యాడ్ల ద్వారా 3 మిలియన్ యూరోలు సంపాదించింది. ప్రఖ్యాత కారు కంపెనీ యాడ్‌తో పాటు జపనీస్‌కి చెందిన బ్యూటీ ప్రొడక్ట్‌కి సంబంధించిన యాడ్‌లో కూడా షూపెట్ మెరిసింది. వెండితెరపై వెలుగులు జిమ్మే తారలకు ఉన్నంత మంది అభిమానులు తనకీ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రాం పేజీకి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉండడమే ఇందుకు నిదర్శనం మరి.

Related posts