telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ భారీగా పడిపోయిన కరోనా కేసులు

corona vaccine covid-19

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.95 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయం లో 147 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,431కు చేరుకోగా… 2,91,846 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,608 మంది కరోనాతో మృతి చెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.78 శాతంగా ఉంటే.. భారత్‌లో 97.17 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 1977 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 845 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35, 421 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Related posts