telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి వనిత

vanitha tatineni minister

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శనివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని హెచ్చరించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు చేరాల్సిన సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సరకులు ఆయా కేంద్రాలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలాని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీగా దోపిడీకీ పాల్పడ్డారని మంత్రి అన్నారు. వాటి పై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వనిత పేర్కొన్నారు.

Related posts