telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ బోర్డు లీలపై స్పందించిన కేటీఆర్

KTR Counter pawan comments

తెలంగాణలో ఈ నెల 18న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కాగా, కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగినట్టు తెలియడంతో నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో సున్నా మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని తెలుగు పేపర్ ను రీవాల్యుయేషన్ చేయించగా, దిమ్మదిరిగే రీతిలో 99 మార్కులు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వ్యవహారం పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షించారని తెలిపారు.

అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Related posts