telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీశైలంలో అర్థరాత్రి కన్నడ భక్తుల వీరంగం..

*అర్ధ‌రాత్రి టీ తాగేందుకు వెళ్లిన భ‌క్తుడుపై దాడి..
*ఆల‌య ప‌రిస‌రాల్లో ఉన్న షాపులు ధ్వంసం చేసిన క‌న్న‌డ భ‌క్తులు
*శ్రీశైలం వీధుల్లో మోహ‌రించిన పోలీసులు..

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు.ఆలయ పరిసరాల్లో దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు.

వివ‌ర్లాలోకి వెళితే..

స్థానికంగా ఉన్న ఒక సత్రం ముందు ఉన్న టీ దుకాణం య‌జ‌మానికి,  కన్నడ భక్తులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. అర్ధ‌రాత్రి రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు టీ దుకాణదారుడితో మంచినీళ్లు ఇవ్వాలంటూ అడిగాడు. నీళ్ళు లేవ‌ని చెప్ప‌డంతో టీ షాపు య‌జ‌మానితో గొడ‌వకు దిగాడు.

ఈ గొడవలో టీ దుకాణం య‌జ‌మానికి, కర్ణాటక వాసల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ క్రమంలో టీషాపు యజమాని సదరు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్​లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Thumbnail image

దీంతో ఈ విషయం తెలిసిన కన్నడ యువకులు కోపోద్రిక్తులై కన్నడ భక్తులు హోటల్‌పై దాడి చేశారు. ఈ గొడవ చిలికి.. చిలికి పెద్ద రచ్చగా మారింది.

ఆలయ పురవీధుల్లో ఉన్న సుమారు 100 తాత్కాలిక దుకాణాలు 20 కార్లు 10 బైక్ లు ధ్వంసం చేశారు. సుమారు 30లక్షల మేర ఆస్తి నష్టం సృష్టించారు.

Srisailam Temple : శ్రీశైలంలో అర్థరాత్రి అరాచకం

దీంతో వ్యాపారస్తులు, స్థానికులు బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి కాలం గడిపారు. దాడులు ఉద్ధృత స్థాయికి చేరడంతో దీంతో శ్రీశైలం వీధుల్లో పోలీసులు మోహరించారు. గొడవను పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే డీఎస్పీ శృతి వచ్చాక వివాదం సద్దుమణిగినట్లు సమాచారం.

 

Related posts