చిత్తూర్ మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలో చికిత్స పొందుతూ శివప్రసాద్ తుదిశ్వాస విడిచారు. టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి శివప్రసాద్ మృతి పట్ల సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
శివప్రసాద్ మరణించడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్థున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు.. పవన్ పై విజయసాయి విమర్శలు