telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి: పవన్ కల్యాణ్

pawan

కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పంతాలు, పట్టింపులకు పోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా వెంటనే విద్యా సంస్థల బంద్, ఇతర చర్యలను అమల్లోకి తేవాలని ఏపీ ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని, పట్టింపులు వద్దని సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా కూడా ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు. కరోనా మహమ్మారి విషయంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్ లను పెంచాలన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకునే చర్యలను సామాజిక బాధ్యతగా గుర్తించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Related posts