telugu navyamedia
క్రీడలు వార్తలు

రష్మిక ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

Rashmika

ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటుందంట. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ చూడడానికి ఇష్టపడుతుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ‘మీ ఫెవరేట్ క్రికెటర్ ఎవరు..?’అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే రష్మిక.. ” నా హీరో మహేంద్ర సింగ్ ధోనీ ” అంటూ బదులిచ్చింది.’ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ .. అంటే చాలా ఇష్టమని, పడి చచ్చిపోతానని, అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్.’ అంటూ చెప్పుకొచ్చింది.. అయితే తన ఫేవరెట్ ఐపీఎల్ జట్టు గురించి అడిగితే మాత్రం. “ఈ సాలా కప్ నమ్‌దే” అంటూ సొంత రాష్ట్రానికి చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని తెలిపింది. గతంలో కూడా ఈ కన్నడ బ్యూటీ క్రికెట్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆర్‌సీబీకి సపోర్ట్ చేసింది. దాంతో రష్మీక ఫేవరేట్ హీరో విరాట్ కోహ్లీ అనుకున్నారంత. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న రష్మిక, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Related posts