telugu navyamedia
రాజకీయ వార్తలు

పార్టీలో కొనసాగే అర్హత పీకేకు లేదు: జేడీయూ

prashanth kishofre

జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ మాట్లాడుతూ ప్రశాంత్ కిశోర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన వెంటనే ప్రశాంత్ కిశోర్ కు నితీశ్ కుమార్ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించి గౌరవించారని, అయితే, పార్టీలో కొనసాగే నైతిక అర్హత కూడా ఆయనకు లేదని అన్నారు.

ప్రధాని మోదీ, నితీశ్ కుమార్ ల నమ్మకాన్ని ఆయన గెలుచుకోలేకపోయారని చెప్పారు. ఆయన కేజ్రీవాల్ పార్టీ కోసం పని చేస్తారని, రాహుల్ గాంధీతో మాట్లాడతారని, మమత బెనర్జీతో కూర్చుంటారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్ వంటి ఇలాంటి వ్యక్తిని వదిలించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Related posts