telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్లాష్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్ని ప్రమాదం ఇవాళ ఉదయం జరిగింది. ప్లాంటులోని టీపీపీ-2 లో మంటలు చెలరేగాయి. టర్బైన్‌ ఆయిల్‌ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనలో 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటార్లు దగ్ధమయ్యాయి. రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. అయితే..వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదమే తప్పింది. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. కాగా..ఏపీలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటికే చాలా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఇక విజయవాడ కోవిడ్‌ సెంటర్‌, అంతర్వేదిలో అగ్ని ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే...ముఖ్యంగా అంతర్వేది అగ్ని ప్రమాదం రాజకీయంగా పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఈ ఘటనలో రథం దగ్ధం అయింది. దీంతో బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై హిందూత్వ కోణంలో విమర్శలు గుప్పించారు.

 

Related posts