telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బహ్మస్త్ర” షూటింగ్ కోసం ముంబైకి నాగ్

లాక్‌డౌన్ అనంతం షూటింగ్ మొదలుపెట్టిన మొదటి తెలుగు స్టార్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఓ వైపు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు తన సినిమాల షూటింగ్ కు కూడా హాజరవుతున్నారు. ఇటీవలే హిమాలయాల్లో ‘వైల్డ్‌డాగ్‌’ షూటింగ్‌ షెడ్యూల్‌లో పాల్గొన్న నాగార్జున… అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకొని బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, మౌనీరాయ్‌తో కలిసి నాగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను వీరి మీద తెరకెక్కిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏజ్ లో కూడా నాగార్జున యంగ్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా స్పీడ్ గా దూసుకెళ్తున్నారు.

Related posts