telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్ధనగ్నంగా హీరోయిన్… ఫేక్ ఐడీ గాళ్ళపై హీరోయిన్ ఫైర్

Ramya

తమిళ హీరోయిన్ రమ్య పాండియన్ న్యూడ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాట రమ్య పాండియన్ పేరు బాగానే వినిపిస్తుంది. ఈ మధ్యే జోకర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రేజ్ వాడుకుంటూ కొందరు పోకిరీలు ఫేక్ ఐడీ సృష్టించి అర్ధనగ్నంగా నిల్చున్న అమ్మాయి ఫోటోను షేర్ చేశారు. వీపుభాగం నుంచి ఉండటంతో అంతా ఆమె అనుకున్నారు పైగా రమ్య అకౌంట్ అని పేరు ఉండటంతో అంతా ఆ భామే అనుకున్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత వెంటనే క్లారిటీ ఇచ్చింది రమ్య. ఫేక్ ఐడీ గాళ్ళపై ఫైర్ అయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దాంతోపాటే తన ఒరిజినల్ ఐడి కూడా ఇదే అంటూ ప్రేక్షకులకు మరోసారి చూపించింది రమ్య.ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పోకిరీల పని పట్టాలంటే పోలీసులు సైబర్ నేరగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అంతేకాదు వారికి ఎలాంటి శిక్ష విధిస్తారనే విషయమై అందరిలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు నెటిజన్లు.

Related posts