telugu navyamedia
సినిమా వార్తలు

అఘోరాగా రాఘవ లారెన్స్

ప్రముఖ డాన్స్ మాస్టర్‌, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ కొత్త చిత్రం “దుర్గ” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. డాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో మాస్, డాన్, రెబల్ వంటి చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన గట్స్ ఏమిటో చూపించారు.

ఇక థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే హార్రర్ చిత్రాలను తెరకెక్కించడంలో లారెన్స్ రాఘవ ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’, కాంచన 3 వంటి హార్రర్ నేపథ్య సినిమాలతో దడ దడ లాడించిన లారెన్స్ రాఘవేంద్ర.. ఇపుడు ‘దుర్గ’ అనే టైటిల్‌తో అల‌రించ‌నున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాఘవ లారెన్స్ చాలా విభిన్నమైన గెటప్ లో సన్యాసి లాగా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా ఇంతకుముందు రాఘవ లారెన్స్ చేసిన హారర్ మూవీస్ కన్నా ఇంకా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్ తో స్పష్టం చేశారు. ఈ హారర్ థ్రిల్లర్ లో లారెన్స్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
అయితే దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు సెకండ్ లుక్ ను కూడా విడుదల చేశారు. సెకండ్ లుక్ లో రాఘవ లారెన్స్ మామూలుగానే కనిపించాడు. కానీ ఫస్ట్ లుక్ లో అఘోరా రూపంలో కనిపిస్తున్నారు.

గతేడాది రాఘవ లారెన్స్ అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మి’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా థియేటర్‌లో కాకుండా నేరుగా హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇపుడు మరోసారి దుర్గ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. మరి ‘దుర్గ’గా లారెన్స్ ఈ సారి ఎలా అలరిస్తాడనేది చూడాలి.

Related posts