telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫన్నీ టిక్ టాక్ తో ఆకట్టుకుంటున్న డేవిడ్ వార్నర్

warner

ఆస్ట్రేలియన్ క్రికెటర్, హైదరాబాద్ సన్ ‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి స్టెప్పులేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ, వాటిని టిక్ ‌టాక్‌లో పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. ఓ క్రికెటర్ సినిమా పాటలకు స్టెప్పులేస్తుండటం అందరినీ హుషారెత్తిస్తోంది. తెలుగు, హిందీ, త‌మిళం ఇలా ప‌లు భాష‌ల‌కి సంబంధించిన సాంగ్స్‌, డైలాగ్స్‌కి ప‌లు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అల‌రిస్తున్నాడు. తాజాగా “స‌రిలేరు నీకెవ్వ‌రు” అనే చిత్రంలోని “మైండ్ బ్లాక్” అనే సాంగ్‌లో వాడిని కొట్ట‌మ‌ని చెప్పు లిరిక్‌కి టిక్ టాక్ వీడియో చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న‌ట్టు ఫోజిచ్చిన వార్న‌ర్ త‌ర్వాత మాయ‌మైపోతాడు. భార్య‌, పిల్ల‌లు ఇంట్లో ఉన్నార‌ని తెలిస్తే బై బై అని చెబుతాం అని త‌న వీడియోకి కామెంట్ పెట్టాడు. వార్న‌ర్ ఇప్ప‌టికే తెలుగులోని పలు సాంగ్స్‌కి టిక్ టాక్ వీడియోలు చేయ‌గా, వాటికి తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఫిదా అయ్యారు.

Related posts