telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐశ్వర్యారాయ్ తో దీపికా పదుకొనె డాన్స్… వీడియో వైరల్

ish

లాక్‌డౌన్ టైంలో ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. దీంతో సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు యాక్టివ్ గా ఉంటున్నారు. వారికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక పాత వీడియోలు సినీ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్‌లో దీపిక‌- ఐశ్వ‌ర్యరాయ్ చేసిన డ్యాన్స్ వైర‌ల్‌గా మారింది. రెడ్ ఔట్‌ఫిట్ ధ‌రించిన దీపికా ప‌దుకొణేని ప‌క్క‌కి తీసుకెళ్ళి మ‌రి డ్యాన్స్ చేసింది ఐష్‌. ఇద్ద‌రు ఎంతో జోష్‌తో డ్యాన్స్ డ్యాన్స్ చేయ‌డం నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తుంది. లాక్ డౌన్ త‌ర్వాత దీపిక శ‌కున్ బ‌త్రా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ది ఇంట‌ర్న్ రీమేక్‌, మ‌హాభార‌తం ఎపిక్ చిత్రాల‌తో బిజీ కానుంది. ఐశ్వ‌ర్య‌రాయ్, మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో న‌టించ‌నుంది.

Related posts