telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మొదలవనున్న రానా కొత్త సినిమా…

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను తనదైన నటనతో మంచి పేరు సంపాదించాడు రానా. అంతేకాకుండా వైవిధ్యమై కథలను ఎంచుకుంటూ తన సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నాడు. అయితే ఈ ఏడాది విడుదల చేయాలనుకున్న సినిమాల్లో 1945 కూడా ఒకటి. కానీ కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. అప్పటి నుంచి సరైన అప్‌డేట్ లేకపోవడంతో దాదాపు ప్రజలు ఈ సినిమాను మరిచిపోయారన్నట్లే ఉంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ మళ్ళీ ప్రారంభం కానుంది. ఇందులో రెజీనా కాసెండ్రా కథానాయికగా చేస్తోంది. ఈ సినిమాకు సీ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్వాతంత్ర్య సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ పాత్రలో రానా కనువిందు చేయనున్నాడు. అతడి ప్రియురాలిగా రెజీనా కనిపిస్తుంది. ఈ సినిమా పక్కకు పెట్టి మూడు సంవత్సరాలు కావడంతో అందరూ ఈ సినిమా గురించి మర్చి పోయారు. ఇప్పుడు ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వస్తుందా అని ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది… అభిమానులను మెప్పిస్తుందా… లేదా అనేది.

Related posts