telugu navyamedia
రాజకీయ వ్యాపార వార్తలు

త‌గ్గుముఖం ప‌ట్టిన బంగారం ధ‌ర‌లు..!

దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బంగారం, వెండికి అత్యంత ప్రముఖ్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా బంగారం బాటలోనే వెండి కూడా ప‌య‌నిస్తోంది. పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం పట్టినట్లే వెండి ధర కూడా తగ్గింది.

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 తగ్గి రూ. 44,600కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 220 తగ్గి రూ. 48, 660కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి.

తాజాగా శనివారం ఉదయం నాటికి కిలో వెండి పై రూ.1000 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం రూ.600 కిలో వెండి ధ‌ర రూ. 600 మాత్రమే తగ్గి రూ. 71,700 వ‌ద్ద కొనసాగుతోంది. అలాగే విశాఖ‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ 100 త‌గ్గి 47,570 చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 109 త‌గ్గి 48,660కి చేరింది.

Related posts