బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ ఎదిగిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవలే చేసిన మరో భారీ ప్రాజెక్ట్ “సలార్” మూవీ. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా… ఈ సాలిడ్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా నిలిచింది. ఇటీవలే సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంబలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం యష్, ప్రభాస్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగండూర్, ప్రభాస్ సార్‌కు ధన్యవాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు రాకీకి ధన్యవాదాలు. సలార్ మిమ్మల్ని నిరాశపర్చదు. మాకు మీ ప్రేమ, మద్దతు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.
previous post
బిగ్ బాస్-3పై మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్