యంగ్ హీరో నితిన్ వివాహానికి సిద్ధమవుతున్నారు. జూలై 26న హైదరాబాద్‌లో రాత్రి 8:30 గంటలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలవారు, సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరవనున్నారు. కాగా తాజాగా నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. తన వివాహానికి హాజరు కావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు హీరో నితిన్.
previous post
next post