telugu navyamedia
సినిమా వార్తలు

“ఎఫ్-2” : డిలీటెడ్ సీన్-2… ప్రకాష్ రాజ్ బాల్యం

F2

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన “ఎఫ్-2” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ లకు జోడిగా తమన్నా, మెహ్రీన్ లు నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ చిత్రం ఇటీవలే యాభై రోజుల వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందనతో “ఎఫ్-2” సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. తాజాగా “ఎఫ్-2” సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని “ఎఫ్-2″ : డిలీటెడ్ సీన్-2” అంటూ దిల్ రాజు తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఈ వీడియోలో వెంకీ, వరుణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రచయితలుగా ప్రకాష్ రాజ్ ఇంటికి వచ్చిన వెంకీ, వరుణ్ లను ప్రకాష్ రాజ్ నా బాల్యం ఎలా రాశారని అడుగుతాడు. దానికి వెంకీ, వరుణ్ చెప్పిన కథ, ప్రకాష్ రాజ్ ఇచ్చిన హావభావాలు వీక్షకుల్ని నవ్విస్తున్నాయి. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి. 

Related posts