telugu navyamedia
క్రీడలు వార్తలు

కిడ్నాప్ కు గురైన మాజీ క్రికెటర్…

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఆసీస్ ఆటగాడు స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తోన్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారినో సొటిరోపౌలోస్‌తో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. మారినో చెల్లెలితో మెక్‌గిల్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కొద్దిరోజుల పాటు మూడోకంటికి తెలియకుండా డేటింగ్‌లో గడిపారు. ఈ విషయం మారినోకు తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. దీనికోసం నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. కిందటి నెల 14వ తేదీన రాత్రి 8 గంటలకు మెక్‌గిల్‌ను నిందితులు అపహరించారు. సిడ్నీ సౌత్ వెస్ట్‌లోని బ్రింగెల్లిలో తన ఇంటికి వెళ్తోన్న మెక్‌గిల్ కారులో కిడ్నాప్ చేశారు. రెండు గంటల పాటు అతనికి నరకయాతన పెట్టారు. కారులో తిప్పుతూ చితగ్గొట్టారు. సిడ్నీ శివార్లలోకి తీసుకెళ్లి తుపాకులతో బెదిరించారు. అక్కడే వదిలేసి, పారిపోయారు. దీనిపై అతను సిడ్నీ సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మ్యాన్ హంట్ ప్రారంభించారు. మూడు వారాల తరువాత నిందితులను అరెస్ట్ చేశారు.

Related posts