హైకోర్టులో ఈరోజు రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితి పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. వీకెండ్ లాక్ డౌన్ గురించి ఆలోచించాలని, నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని, మే 8 వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు సీఎస్ హైకోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. అనంతరం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా కంట్రోల్ లోనే ఉందని, కరోనాపై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా సరే ఖర్చు చేయమని సీఎం చూపినట్టు సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎస్ అధికారులను ఆదేశించినట్టు సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. అయితే చూడాలి మరి దీని పై మళ్ళీ హై కోర్టు ఏం అంటుంది అనేది.
previous post
next post
సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: కన్నా