కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాము సరఫరా చేస్తున్న టీకా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సీరం ఇన్‌స్టిట్యూట్. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును రూ. 400 లకు విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఆ ధరను రూ. 300లకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పునావాలా ట్వీట్ చేశారు. తగ్గించిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు రూ. వేల కోట్ల నిధులు ఆదా కావడంతో పాటు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకొనేలా ఉపయోగపడుతుందన్నారు.
previous post