telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి: డొనాల్డ్ ట్రంప్

trump usa

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రోయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆక్స్ ఫర్డ్ తో కలిసి ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ త్వరలో రానుందని అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన యూఎస్ లో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆఖరి దశకు చేరుకున్న వ్యాక్సిన్ లలో ఇది కూడా వుందని ఆయన అన్నారు. అమెరికా ఇప్పటివరకూ అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను చేసి చూపిందని, కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ విజయం సాధిస్తామని అన్నారు. అమెరికాలోని 80 నగరాల్లో 30 వేల మంది వాలంటీర్లపై ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనుంది. 18 ఏళ్ల పైబడిన వివిధ జాతులు, సంస్కృతులు, దేశాలకు చెందిన వారు ఈ వాలంటీర్లలో ఉన్నారు. హెచ్ఐవీ వంటి వ్యాధులున్నవారిపైనా ఈ దశలో వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారు. కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న వారిని కూడా చేర్చామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది.

Related posts