telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రభుత్వ ఆస్తుల మీద టీఆర్ఎస్ హోర్డింగ్స్…

ponnam prabhakar fire on ktr

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న 150 డివిజన్ల లో ప్రభుత్వ ఆస్తుల మీద టీఆర్ఎస్ హోర్డింగ్స్ వెలిశాయని పొన్నం ప్రభాకర్  అన్నారు. ఎన్నికల కమిషన్ కి తొలగించాలని కోరాము కానీ పట్టించుకోలేదని ఆయన అన్నారు.  ఎన్నికల కమిషనర్ గౌరవాన్ని కాపాడుకోవాలన్న అయన  24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించకపోతే  టీఆర్ఎస్ హోర్డింగ్స్.. ప్రభుత్వ ఆస్తుల మీద ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించండని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు మన ప్రతిష్ట కాపాడుకోవాలన్న ఆయన ఇవి క్యాడర్ ఎన్నికలు…పార్టీని కాపాడుకోవాల్సింది మనమేనని అన్నారు. ఇక ఎన్నికల కమిషన్… జీహెచ్ఎంసీ కమిషనర్ పై ఉత్తమ్ ఫైర్ అయ్యారు.  మెట్రో పిల్లర్ల కు టీఆర్ఎస్ కటౌట్ లు పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ సిగ్గుపడాలన్న ఆయన LEd వ్యాన్స్ అడిగితే మాకు అనుమతి లేదు అన్నారని కేటీఆర్ కి మాత్రమే అనుమతి ఇచ్చారని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కేటీఆర్ కి హైదరాబాద్ రాసిచ్చాడని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్…ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చూడాలి మరి దీని పై వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts