ఉబర్ సంస్థ మరో ముందడుగు వేసింది. గాల్లో ఎగిరే ట్యాక్సీ కార్లను మన ముందుకు తెచ్చింది. దీన్ని చూసేందుకు హెలికాప్టరో.. కారో కూడా అర్థం కాదు. నలుగురు ఎంచక్కా ఈ కారులో వెళ్లొచ్చు. నార్త్ స్టార్ అనే కంపెనీతో కలసి ఉబర్ ఈ కారును డిజైన్ చేసింది. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ఉబర్ ఎలివేట్ సమ్మిట్-2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది.
2020లో తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామని, 2023 వరకు ఎయిర్ ట్యాక్సీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనుంది.
పవన్ పేరును వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు… : అడివిశేష్