telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఒడిశా : .. ఆరు నెలలలో .. వెయ్యికిపైగా అత్యాచారాలు.. ఆందోళనలో ప్రభుత్వం..

invigilator abusing btech student

పోక్సో చట్టం తరువాత కూడా రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, లైంగికవేధింపులు పెచ్చుపెరిగిపోవడంపై ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం గత ఆరు నెలల్లోనే ఒడిశా రాష్ట్రంలో 1,005 మంది బాలికలు, మహిళలపై అత్యాచారం కేసులు జరగడం సంచలనం రేపింది. రాష్ట్రంలోని బాంగ్రీపోసి, రసగోబింద్ పూర్. కరంజియా పట్టణాల్లో మంగళవారం ఒక్కరోజే జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించారు. ఈ మూడు పట్టణాల్లోనూ ఒకేరోజు జరిగిన అత్యాచార ఘటనలపై ఒడిశా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు నరసింగ మిశ్రా అసెంబ్లీలో ప్రస్థావించారు. అత్యాచారం కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని మిశ్రా సర్కారును డిమాండ్ చేశారు. ఒడిశా రాష్ట్రంలో పెచ్చుపెరిగిపోతున్న అత్యాచారం ఘటనలపై అసెంబ్లీలో చర్చించి నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాలని బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే లతికా ప్రధాన్ సర్కారును కోరారు. అత్యాచారాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలని లతికా ప్రధాన్ డిమాండ్ చేశారు. ఒడిశా సర్కారు కూడా అత్యాచారం ఘటనలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Related posts