ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో సామాన్య ప్రయాణికుల్లా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల పై మాజీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. విమానాశ్రయ సిబ్బంది తీరును తప్పుబట్టారు. వీఐపీ, జడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును తనిఖీలు చేయడం దారుణమన్నారు.
విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేక వాహనాన్ని కేటాయించకపోవడంపైనా మాజీ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అందులో భాగంగానే ఇలా సామాన్య ప్రయాణికుల్లా తనిఖీలు చేసి, ప్రయాణికుల బస్సులో పంపించారని ఆరోపించారు.