telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి వనిత

vanitha tatineni minister

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఏపీ స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక వృద్ధుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పెన్షన్ డబ్బులను పెంచారని తెలిపారు. రూ. 2000 ఉన్న పెన్షన్‌ను విడతల వారీగా రూ.3 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

కంటి వెలుగు కార్యక్రమం వృద్ధులకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వేల వ్యాధులకు వర్తింప చేసేలా సీఎం నిర్ణయించారని వెల్లడించారు. ప్రతి చిన్న విషయంలో వృద్ధులకు మనవడిలా జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. వృద్ధుల కోసం ఆస్పత్రుల్లో జరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశారని తెలిపారు. రైల్వే, బస్టాండ్‌లో ర్యాంపులను ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.

Related posts