telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మోడీకి మిగిలిపోయిన .. మరో రెండు ఆశలు..

modi on jammu and kashmir rule

రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మోదీ దృష్టి కీలకమైన రెండు అంశాల మీద ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఎప్పటి నుండో ప్రస్తావిస్తున్న ఉమ్మడి పౌర స్మ్రుతి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నార్సీ అమలు చాప కింద నీరులా కొనసాగుతోంది. ఇక, ఉమ్మడి పౌర స్మ్రుతికి లా కమిషన్ సైతం మద్దతు పలకటంతో న్యాయ పరంగా ముందుకు అడుగు వేసే అవకాశం లభించింది. దీని అమలు దిశగా కేంద్ర న్యాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఇక.. చట్ట బద్దంగా అమలు చేయటానికి ఇప్పటికే..రాజకీయంగానూ వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోక్ సభలో మెజార్టీకి ఇబ్బంది లేకపోవటంతో..రాజ్యసభలోనూ పూర్తి మెజార్టీ సాధించే క్రమంలో సభ్యులను తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే..వారికి స్వాగతం పలుకుతున్నారు. దశాబ్దాల కాలంగా వివాదాలుగా మారిన ఆర్టికల్ 370 రద్దు..అయోధ్య వివాదానికి ముగింపు లభించటంతో ఇక..అదే తరహాలో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయటం మోదీ లక్ష్యంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత బీజేపీ నేతలు అనేక మంది ఇదే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

దౌత్య పరంగానూ మోదీ అంతర్జాతీయ స్థాయిలో తనకు మద్దతు సంపాదించుకున్నారు. ఇక, ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఖరారు చేస్తూ భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన భారత భౌగోళిక మ్యాపుల్లోనూ పీఓకేను భారత్ లో అంతర్భాగంగా చూపించటం ద్వారా..కేంద్రం తమ లక్ష్యాన్ని సుస్పష్టం చేసింది. దీని పైన పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక, పీఓకే మీద సైతం మోదీ సమయం చూసి నిర్ణయం తీసుకోనున్నారు. 2019 ఎన్నికల తరువాత నుండే బీజేపీ జమిలి ఎన్నికల ప్రస్తావన పదే పదే తీసుకొస్తోంది. ప్రధాని మోదీ తొలి నెలలోనే అన్ని పార్టీల అధినేతలతో ఇదే అంశం పైన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మెజార్టీ పార్టీల మద్దతు కూడగట్టారు. 2024 నాటికి మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయి. బీజేపీ సిద్దాంతాల ప్రకారం ఆ వయసు దాటిన వారు కీలక పదవుల్లో ఉండకూడదు. ఆ లోగానే కాంగ్రెస్ రహిత భారత్ బీజేపీ అంతిమ లక్ష్యం. అందులో భాగంగా.. దేశ వ్యాప్తంగా తమకు అనుకూల వాతావరణం కల్పించి.. ఉత్తర భారత పార్టీగా ముద్ర పడిన బీజేపీని..దక్షిణాదిన విస్తరించి..కాషాయ జెండా ఎగుర వేయాలని.. తాను ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలోని సమస్యలను పరిష్కరించిన ముద్రతో పాటుగా..బీజేపీకి చెక్కు చెదరని ఆదరణ సంపాదించి పెట్టాలనేది మోదీ లక్ష్యం. దీంతో..రానున్న కాలంలో మోదీ వేయబోయే అడుగులు మరిన్ని సంచలన నిర్ణయాలకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Related posts