వైసీపీ బెదిరింపులకు ఎవరు భయపడరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న మహానాడులో రెండో రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గతంలో టీడీపీపై బురదజల్లిన వారు అదే బురదలో కూరుకుపోయారని ఆ పార్టీని ఎవరూ కదిలించలేరని చెప్పారు. తమ పార్టీ ఎవరికీ భయపడదని, సవాళ్లు ఎదుర్కోవడం తమకు కొత్త కాదని తెలిపారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారని ఆయన చెప్పారు.
హత్యా రాజకీయాలు చేయడం తమకు అలవాటు లేదని చెప్పారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదనానికి నిలువెత్తు రూపమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం ఈ బడ్జెట్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి