telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో లాక్ డౌన్ : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని… లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి స్థాయి/పాక్షిక లాక్ డౌన్ ప్రకటించాయన్నారు. మొత్తానికి ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని… లాక్ డౌన్ సమయంలో వైద్య సేవలు, పేషేంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా, టెస్టులు, ట్రీట్ మెంట్ ఆగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని నిరూపణ అయిందని… ఈ లాక్ డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రానికి అవసరమున్నంత ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ఇంజెక్షన్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించిందని… ఆక్సిజన్, రెమ్ డిసీవర్ ఇంజెక్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని… కరోన చికిత్సకు అవసరమైన అన్నీ రకాల మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

Related posts