telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ…

asaduddin owisi

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వైసీపీ ఎమ్మెల్యే మీద ఘాటు కామెంట్స్ చేశారు. ఆదోని పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసదుద్దీన్ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని బేకార్ అంటు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బేకార్ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాడంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న ఆయన నన్ను రానివ్వకుండా ఆపడం ఎవరి తరం కాదు మైనార్టీ ఓట్లతో ముఖ్యమంత్రులు అయ్యారు మాకు ఆంక్షలు పెడుతున్నారా అని ప్రశ్నించారు. ఇలా కొనసాగితే అన్ని స్థానాల్లో మేము పోటీ చేసి గెలుస్తాం అని అన్నారు. అలాగే వైసిపి రెడ్ల పార్టీ ,టీడీపీ కమ్మ పార్టీ అని ఈ రెండు పార్టీలకు పురపాలక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటుతాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సమావేశానికి సీఎం జగన్‌ అనుమతి ఇవ్వలేదని ఓవైసీ పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్‌రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది.

Related posts