యూపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని కౌశంబి జిల్లాలో బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ – స్కార్పియో వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన చోటు ఉన్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో స్కార్పియో వాహనంలో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందులో ఎనిమిది మంది మృతి చెందడం విచారకరం. అయితే.. వీరంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణం ఇసుక లారీ డ్రైవర్ తప్పిదమేనని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకుంటుందని యోగి హామీ ఇచ్చారు.
previous post