telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

లైవ్ లో మహిళా రిపోర్టర్ పట్ల అసభ్య ప్రవర్తన…!?

Live

లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న జార్జీయాకు చెందిన ఓ మహిళ జర్నలిస్ట్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. 10కే రన్ ఈవెంట్‌ను కవరేజ్ చేస్తున్న డబ్ల్యూఎస్ఎవీ-టీవీ రిపోర్టర్‌ అలెక్స్ బోజార్జియన్‌ను ఓ వ్యక్తి వెనుకవైపు కొట్టడం వీడియోలో ఉంది. అతని చర్యతో అలెక్స్‌కు కొద్దిసేపు నోటమాట రాలేదు. ఆ తరువాత తెరుకొని యధావిధిగా రిపోర్టింగ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అలెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వ్యక్తి చర్య నన్ను శారీరకంగా, మానసికంగా బాధించిందని అలెక్స్ పేర్కొంది. కాగా, వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఈ హేయమైన చర్యకు పాల్పడిన వ్యక్తిని స్టాతెస్బోరో యూత్ మినిస్టర్ టామీ కాల్వేగా గుర్తించడం జరిగింది. ఆ తరువాత అతను క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.  

Video Source: Any Articles

Related posts