telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కెసిఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం : వ్యాక్సినేషన్ నిలిపివేత

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని రేపు, ఎల్లుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ని రద్దు చేసింది. తిరిగి ఈ నెల 16 నుంచి చేపట్టనున్నట్లు ప్రజారోగ్యశాఖ తెలిపింది. కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి మొదటి డోస్ తరువాత 12 వారాలు దాటకే రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కొవిషీల్డ్‌ టీకా రెండో డోస్‌ను 6-8 వారాల తర్వాత ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో శని, ఆది వారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని నిలిపివేస్తున్నట్టు వైద్య శాఖ పేర్కొంది. కాగా తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,305 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 29 మంది కరోనాతో మృతి చెందారు. 

Related posts