telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సోషల్ మీడియాలో పుకార్లను పుట్టిస్తే కఠిన చర్యలు!

instagram replasing facebook soon

సాంకేతిక రంగం అభివృద్ది చెందిన నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన నేడు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సోమవారం హెచ్చరించారు. 11 నెలల కింద ఓ ఫేసుబుక్ ఖాతాదారుడు పోలీసులంటే కూడా విలువు లేకుండా పోయింది.

ఒక ఎమ్మెల్సీ కొడుకు అంట కాళ్లు పట్టుకుంటేనే ఎస్‌ఐని వదిలేస్తాడంట పాపం ఎలా కొట్టారో చూడండి అని వీడియో పోస్టు చేశాడు.అయితే ఈ ఘటన తెలంగాణలో జరగలేదు.ఇప్పుడు కొంతమంది పని గట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అనవసర పుకార్లను పుట్టిస్తున్నారు.ఇది కరెక్ట్ కాదని సీపీ సజ్జనార్ వివరించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై పౌరులు సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Related posts