telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రైల్వే కూలీలకు, సహాయకులకు… రైల్వే సిబ్బంది మాదిరి వైద్య సదుపాయాలు.. !

medical services like employees to railway labour

దేశంలో లైసెన్సు కలిగిన 20 వేలమంది రైల్వే కూలీలకు, సహాయకులకు… రైల్వే సిబ్బంది మాదిరిగానే వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇది అమలయిన పక్షంలో రైల్వే కూలీలు, సహాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు రైల్వే ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సేవలు అందుకోవచ్చు. ఇంతేకాదు వీరికి ఉచితంగా ట్రైన్‌పాస్, రెస్ట్‌రూం వినియోగించుకునేందుకు అవకాశం కూడా కలగనుంది.

అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో తమ పేరు నమోదు చేయించుకున్న రైల్వే కూలీలు, సహాయకులు కూడా ఈ సదుపాయలు పొందవచ్చు. ఈ విధానంలో చికిత్స పొందిన పక్షంలో, దానికి సంబంధించిన ఖర్చును ఆయుష్మాన్ విభాగం నుంచి రైల్వేశాఖ వసూలు చేయనుంది. కాగా రైల్వే కూలీలకు ప్రతీయేటా రెండుసార్లు యూనిఫారం ఇస్తున్నారు. ఇకపై ఏడాదికి మూడు యూనిఫారాలు ఇవ్వనున్నారు.

Related posts