telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరం : సీఎం జగన్

ప్రతి పేదవాడికి రైట్‌ టుఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లు (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు) కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ సవరణలు కోరుతూ శాసన మండలిలో తిరస్కరించారని మండిపడ్డారు.

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరమన్నారు. ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతామని, ఒకవేళ మండలి బిల్లు అడ్డుకున్నా చట్టంగా మారుతుందని, అన్నీ తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదని అన్నారు. శాసనమండలి చేసిన సవరణలను అసెంబ్లీ తిరస్కరించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అవసరమని చెప్పారు.

Related posts