telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తమ పోరాటాల ఫలితంగా ఎనిమిది చట్టాలు: జయప్రకాశ్ నారాయణ

jaya prakash

తమ అధ్యయనాలు, పోరాటాల ఫలితంగా ఇప్పటికి దేశంలో ఎనిమిది చట్టాలు చేశారని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇవి తాము సాధించిన విజయాలని జేపీ వ్యాఖ్యానించారు.

రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రానుందన్నారు. పీఎం, సీఎంలు, కలెక్టర్లు తప్ప మిగతా వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోందని చెప్పారు. ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని పేర్కొన్నారు.

ప్రజల బతుకులు మారట్లేదని, మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదని జేపీ అన్నారు. నేర పరిశోధన, న్యాయ విచారణ వేగంగా జరగాలని చెప్పారు. ప్రజలు ఎన్ కౌంటర్ వంటి సత్వర న్యాయం వైపునకు మొగ్గుచూపుతున్నారని జేపీ అన్నారు. తమ ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అవుతోందని తెలిపారు.

Related posts