telugu navyamedia
సినిమా వార్తలు

ఆమెతో మాట్లాడేటపుడు మొదట సిగ్గేసింది – చ‌ర‌ణ్‌

ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలోని నా ఫిజిక్​ కోసం చాలా కష్టపడ్డా అని హైదరాబాద్‌లో మీడియాతో స‌మావేశంలో రామ్ చ‌ర‌ణ్ అన్నారు. ఈ సినిమాను ఉత్సాహంగా ఫీల్ అయ్యామని.. కరోనా పాండమిక్ రావడంతో ప్రపంచం మొత్తం బాధకు గురయ్యిందని.. ఒక్క చిన్న పాయింట్ ఉత్సాహం కోల్పోకుండా చేసింది.. లాక్ డౌన్ అనంతరం సినిమాకు రెండింతల జోష్‏తో స్టార్ట్ చేశామని చెప్పారు చరణ్.

ఆలియా గొప్ప నటి అని, ఆమెతో మాట్లాడేటపుడు మొదట సిగ్గేసిందని అన్నారు. ఇక నాది, తారక్​ది నిజమైన స్నేహం.​ మా మీది గాసిప్స్  ఏమైనా వ‌చ్చినా ..బహుశా మా ఇంట్లో కానీ ..నాకు తారక్​కు మధ్య గానీ చిన్న చిన్న విభేధాలు వచ్చినా మా మధ్య స్నేహం ఎంత గట్టిగా ఉందనేదే చూసుకుంటాం. నిజంగానే విభేదాలు ఉంటే విడిపోతాం గానీ​ నటిస్తూ ఉండలేము. మాది నిజమైన స్నేహం” అన్నారు హీరో రామ్‌చరణ్‌.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ హీరోల‌గా ద‌ర్శ‌ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌'(రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్ర‌మంలో సినిమాకు సంబంధించి రాజ‌మౌళి మార్క్ స్ట్రాటజీ మార్కెటింగ్ ప్లాన్ లతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ వేగ‌వంతం చేశారు మేకర్స్.

Related posts