telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ్ “వైల్డ్ డాగ్”కు బాలీవుడ్ హీరో తండ్రి స్టంట్స్

wild-dog

కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం “వైల్డ్‌ డాగ్‌”. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో జరుగుతోంది. ఇందుకోసం గత వారం నాగ్‌తో పాటు ప్రధాన పాత్రాధారులు అక్కడికి వెళ్లారు. కాగా దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో షూటింగ్‌ జరుగుతుండగా.. 21 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ షూటింగ్‌లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్‌ భాగమయ్యారు. అక్కడ యాక్షన్ సన్నవేశాలు ఆయన ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇక మనాలి షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని శామ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. “మనాలిలోని రోతంగ్‌ పాస్‌లో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో దేవుడి దయ వలన షూటింగ్‌ జరుగుతోంది. ఇవాళ ఇక్కడ మంచు పడటం ప్రారంభం అయ్యింది” అని కామెంట్ పెట్టారు.

Related posts