telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్…24 మంది జవాన్లు మృతి !

చత్తీస్‌ ఘడ్‌ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు.. ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోల కాల్పుల్లో 24 మంది జవాన్లు చనిపోయారని సమచారం అందుతోంది.8 మంది డీఆర్‌జీ జవాన్లు, 6 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, 8 మంది కోబ్రా బెటాలియన్ కు చెందిన వారితో పాటుగా మరో ఇద్దరు జవాన్ లు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం ఇంకా అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ ఘటనలో మొత్తం 40 మందికి పైగా జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత.. 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని లేటెస్ట్‌గా చత్తీస్‌గఢ్‌ పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ 15 మంది జవాన్లు ఎక్కుడున్నారో తెలుసుకునేందుకు చత్తీస్‌ ఘడ్‌ పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ చేస్తున్నారు. రీఎన్‌ ఫోర్స్‌మెంట్‌ టీంను ఘటన స్థలానికి పంపించారు. మృతి చెందిన జవాన్లలో ఇద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించారు. గాయపడిన జవాన్లను బీజాపూర్‌ ఆస్పత్రిలో కొందరిని, మరికొందరినీ రాయ్‌పూర్‌ ఆస్పత్రిలో చేర్చారు.

Related posts