telugu navyamedia
సినిమా వార్తలు

శ్రియ శరణ్ “సండకారి” ఫస్ట్ లుక్

Sandakari

బాస్‌ ప్రొడక్షన్స్‌ కార్పొరేషన్‌, మెట్రో నెట్‌ మల్టీ మీడియా సంస్థలు “సండకారి – ది బాస్‌” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విమల్‌కు జోడీగా శ్రియ నటిస్తోంది. ప్రభు, సత్యన్‌, కేఆర్‌ విజయ, రేఖ, క్రేన్‌ మనోహర్‌, మహానది శంకర్‌, ఉమా పద్మనాభన్‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మలయాళంలో దిలీప్‌, మమతా మోహన్‌దాస్‌ జంటగా జీత్తు జోసెఫ్‌ దర్శకత్వంలో భారీ విజయం సాధించిన “మై బాస్‌” చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రూపొందుతుండ‌గా త‌మిళంలో ఈ చిత్రాన్ని ఆర్‌.మాదేష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అమ్రీష్‌ సంగీతం సమకూర్చుతున్నారు. యాక్ష‌న్, కామెడీ, డ్రామా అన్ని అంశాలు ఇందులో ఉంటాయ‌ట‌. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని తాజాగా విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో వీరిద్ద‌రిని చూస్తుంటే కార్పొరేట్ కంపెనీలో పని చేసే ఉద్యోగులులా క‌నిపిస్తున్నారు. . ఇక శ్రియ 2018లో ఆండ్రీ కొశ్చెవ్‌ని రాజ‌స్థాన్‌లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌ని పూర్తిగా త‌గ్గించేసింది. చివ‌రిగా గౌత‌మ‌పుత్ర శాత‌క‌ర్ణి చిత్రంతో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్” సినిమాలలో నటిస్తోంది.

Related posts