telugu navyamedia
సినిమా వార్తలు

మొగుళ్ళను వదిలేసి మరీ వస్తారు… సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Salman-Khan

సల్మాన్ ఖాన్ నటించిన “భారత్” సినిమా నుండి ప్రియాంకా చోప్రా తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. అయితే సల్మాన్ తన సినిమా నుండి ప్రియాంక తప్పుకోవడంపై తరచూ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఆమె అదే సమయంలో తన పెళ్లి పెట్టుకుంది. ఈ విషయంపై సల్మాన్ మీడియాలో మాట్లాడుతూ “ఆమె వెళ్లిపోయింది.. మాకు నష్టం ఏమీ కాలేదు. ఆమె మొగుడి కోసం నా సినిమా వదులుకుంది. నా సినిమా కోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ మాటలను ఆయన సరదాగా అన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు సల్మాన్ కు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. నిజమైన మగాళ్లు ఇలా మాట్లాడరని, కొందరైతే ప్రియాంకా నిజమైన మగాడి కోసం సినిమా వదులుకుందంటూ సల్మాన్ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts